Raj Tarun: ఉయ్యాల జంపాల సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాల్సిన ఆయన ఎలా హీరోగా మారారో ఎంతో ఆసక్తిగా వివరించారు. ఇక సినిమా చేయడానికి ముందు దాదాపు 52 షార్ట్ ఫిల్మ్స్ తీసినట్లు చెప్పారు. అయితే షార్ట్స్ ఫిల్మ్స్ తీసే సమయంలో జరిగిన ఎన్నో సంఘటనలు పంచుకున్నారు. జేబులో వంద రూపాయాలు లేకుండా ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీసినట్లు చెప్పారు. ఆ సమయంలో రామ్మోహన్ పిలవడం సినిమాకు పనిచేయమని చెప్పడంతో బీ టెక్ మధ్యలోనే వదిలేసినట్లు పేర్కొన్నారు. తనకు హీరోగా నటించడం కన్నా డైరెక్టర్ అవడమే ఇష్టమని తెలిపారు. మొదటి షార్ట్ ఫిల్మ్ తీయడానికి ఎంత కష్టడ్డారో చెప్పారు. తరువాత ఇండస్ట్రీలో జరిగిన పరిస్థితులను వివరించారు. ఇక ఆయన కుటుంబం గురించి, రాబోయే సినిమాల గురించి ఎంతో ఆసక్తిగా వెల్లడించారు. ఆ విషయాల గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి.