»He Cheated That He Would Get Married Lavanya Accuses Hero Raj Tarun
Raj Tarun: పెళ్లి చేసుకుంటా అని మోసం చేశాడు.. హీరో రాజ్ తరుణ్‌పై లావణ్య ఆరోపణలు
హీరో రాజ్ తరుణ్‌పై పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు మోసం చేశాడు అంటే లావణ్య అనే యువతి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
He cheated that he would get married.. Lavanya accuses hero Raj Tarun
Raj Tarun: టాలీవుడ్ హీరో రాజ్‌తరుణ్ (Raj Tarun) పై తాజాగా కేసు నమోదు అయింది. తనను పెళ్లి చేసుకుంటా అని ఇప్పుడు వదిలేసడని తన ప్రేయసి లావణ్య (lavanya)పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రాజ్ తరుణ్ తాను ప్రేమించుకన్నామని, తనను పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడు అని, తీరా ఇప్పుడు వదిలేసి వెళ్లిపోయాడని నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ ఇప్పుడు ఓ సినీ నటితో ప్రేమలో ఉన్నాడని, ఈ విషయాన్ని నిలదీస్తే తనను చంపేస్తా హీరోయిన్, తన సోదరుడు బెదిరిస్తున్నారని వాళ్లపై కూడా ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదులో లావణ్య, రాజ్ తరుణ్ పదకొండేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు గుడిలో కూడా పెళ్లి చేసుకున్నట్లు రాసుకొచ్చారు. ఇప్పుడు తనతో నటిస్తున్న హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకొని తనను వదిలేసినట్లు వెల్లడించింది. గత మూడు నెలలుగా రాజ్ తరుణ్ తనతో ఉండడం లేదని, ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు తెలిపింది. ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో జోక్యం చేసుకుంటే తనను చంపేసి బాడీ మాయం చేస్తామని హీరోయిన్, తన తమ్ముడు బెదిరిస్తున్నారని వారిపై కేసు నమోదు చేసింది. రాజ్ తరుణే తన ప్రపంచం అని, ఎలాగైనా తను కావాలని, తనకు ఈ విషయంలో న్యాయం చేయాలి అని పేర్కొంది. గతంలో తనపై వచ్చి డ్రగ్స్ ఆరోపణలు కూడా కావాలనే చేశారు అని, వారే ఆ కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో తాను 45 రోజులు జైలులో ఉన్నట్లు, ఆ సమయంలో రాజ్ తరుణ్ ఏ సాయం చేయలేదని లావణ్ ఫిర్యాదులో పేర్కొంది.