యంగ్ హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ఇద్దరిపై కేసు నమోదు చేసింది. అంతేకాదు రాజ్ తరుణ్‌కు రూ.70 లక్షలు ఇచ్చాను అని ఆరోపించింది.
Another twist in Rajtarun's case.. Lavanya claims to have given Rs. 70 lakhs
Raj Tarun: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ (Raj Tarun)-లావణ్య (lavanya) కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి ఇప్పుడు హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకొన్నాడు లావణ్య ఆరోపించింది. అలాగే తనకు ప్రాణహాని ఉందని, రాజ్ తరుణ్ తననను వదిలేసి వెళ్లిపోయాడని నార్సింగి పోలీస్ స్టేషన్ లావణ్య పిటిషన్ వేసింది. తాజాగా పోలీసులకు తగిన ఆధారాలు అందించి మరోసారి రాజ్ తరుణ్‌పై కేసు పెట్టింది. ఆధారాలు అందుకున్న పోలీసులు రాజ్ తరుణ్, మాల్వీ మాల్హోత్రాలపై కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. భారీ మొత్తం రాజ్ తరుణ్‌కు డబ్బులు కూడా ఇచ్చినట్లు లావణ్య పేర్కొంది. దీంతో పోలీసులు ఈ కేసును సిరీయస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారంలో ముగ్గిరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద నార్సింగి పోలీసులు కేసులు ఫైల్ చేశారు. ఇందులో ఏ1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వీ మల్హోత్రా, ఏ౩గా మాల్వీ సోదరుడు మయాంక్ మల్హోత్రాను చేర్చారు. తాను ముందు నుంచి చెబుతున్నట్లు 2008 నుంచి రాజ్‌తరుణ్, లావణ్య మధ్య పరిచయం ఉంది. 2010లో లావణ్యకు రాజ్ తరుణ్ ప్రపోజ్ చేశాడు. 2104లో తనను పెళ్లి చేసుకుంటానను అని చెప్పాడు. ఆ సమయంలో రాజ్ తరుణ్‌కు లావణ్య రూ. 70 లక్షలు ఇచ్చామని తెలిపారు. 2016లో రాజ్ తరుణ్ వలన లావణ్య గర్భం దాల్చింది. విషయం తెలుసుకొని రెండు నెలల్లో తనకు అబార్షన్ చేయించాడు, ఆసుపత్రి బిల్లులు కూడా రాజ్ తరుణే చెల్లించాడు అని చెప్పింది.
మాల్వీతో పరిచయం అయిన తరువాత రాజ్ తరుణ్ తనను విడిచి వెళ్లిపోయినట్లు లావణ్య చెప్పింది. ఎందుకు అని ప్రశ్నించినప్పుడు తనను పథకం ప్రకారం డ్రగ్స్ కేసులో ఇరికించారని చెప్పింది. ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందని, మాల్వీ మల్హోత్ర సోదరుడు తనను చంపెస్తా అని బెదిరింపు కాల్స్ చేస్తున్నాడు అని ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ తరుణ్ తాను సన్నిహితంగా ఉన్న ఫోటోలను, ఆడియో క్లిప్స్‌ను పోలీసులకు అందించినట్లు, న్యాయస్థానాలు తనకు న్యాయం చేయాలని కోరతోంది. ఈ కేసు ఇంకా ఎన్ని ట్విస్టులు తిరుగుతుందో చూడాలి.