జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మొదటి భాగం నుంచి లీకైన డైలాగ్ ఒకటి.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డైలాగ్ విన్న తర్వాత సాదా సీదా మగాడైతే కాదని అంటున్నారు.
Devara: 'Devara' dialogue leak.. Not a simple man?
Devara: దేవర సినిమాలో.. ఇప్పటి వరకు ఎన్టీఆర్ను చూడనంత మాస్ క్యారెక్టర్లో చూపించబోతున్నాడు కొరటాల శివ. సముద్రం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నెలలోనే దేవర పార్ట్ 1కి గుమ్మడి కాయ కొట్టేయనున్నారు. సెప్టెంబర్ 27న దేవర రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా ఫియర్ సాంగ్కు మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి.
అందుకు తగ్గట్టే.. ఈ సినిమా పై మరింత అంచనాలు పెంచేస్తున్నాయి లేటెస్ట్ అప్డేట్స్. లేటెస్ట్గా ఈ సినిమా నుంచి ఓ డైలాగ్ లీక్ అయినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేవరలోని ఓ డైలాగ్ లీక్ అయినట్లుగా చెబుతున్నారు. ‘సాదా సీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా’.. అనే డైలాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ డైలాగ్ విన్న తర్వాత సినిమాలో టైగర్ ఎంత పవర్ ఫుల్గా కనిపిస్తాడో ఊహించుకోవచ్చు.
ఖచ్చితంగా దేవర మాత్రం సాదా సీదా మగాడైతే కాదు.. వేటాడే వీరుడు అని చెప్పొచ్చు. కొరటాల కూడా దేవర చేసే మృగాల వేట మామూలుగా ఉండదని ముందు నుంచి చెబుతూ వస్తున్నాడు. ఇక ఎన్టీఆర్.. ఈ సినిమా కాలర్ ఎగరేసేలా ఉంటుందని చెబుతున్నాడు. కాబట్టి.. సెప్టెంబర్ 27న దేవర చేసే ఊచకోతకు బాక్సాఫీస్ బద్దలవుతుందని చెప్పొచ్చు.