BHPL: మొగుల్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన యువకుడు మూత రాకేష్ (25) అనారోగ్యంతో మనస్థాపానికి గురై నిన్న రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పెఱిక సంఘం జిల్లా అధ్యక్షుడు సూరం రవీందర్ మృతుడి ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువత వ్యసనాలకు బానిస కాకూడదని, అనారోగ్యాలకు గురవుతున్నారని సూచించారు.