2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమామ్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. UAPA కేసులో వీరి బెయిల్ పిటిషన్లను వేర్వేరుగా విచారించాలని కోర్టు నిర్ణయించింది. మిగిలిన నిందితులతో పోలిస్తే ఖలీద్, ఇమామ్ల పరిస్థితి భిన్నంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో వారి బెయిల్ వ్యవహారంపై తదుపరి విచారణల్లోనే స్పష్టత రానుంది.