KMM: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనట్లు కారేపల్లి గురుకుల ప్రిన్సిపల్ హరికృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుందని మరిన్ని వివరాలకు సమీప పాఠశాలను సంప్రదించాలని ఆయన కోరారు.