TG: విద్యా సంస్థల్లో నెలకొన్న సంక్షోభంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ MLAలు అసెంబ్లీ సెక్రటరీకి వాయిదా తీర్మానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు PG వర్సిటీల్లో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య తగ్గిపోయిందన్నారు. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని, దీనికి మౌలిక వసతుల లేమి ప్రధాన కారణమని ఆరోపించారు.