ASF: విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆ శాఖ జిల్లా SE ఉత్తమ్ జాడే సోమవారం తెలిపారు. విద్యుత్ పొదుపు కోసం LED బల్బులు వాడాలని నాసిరకం తీగలు, స్విచ్లు వాడకూడదని సూచించారు. రైతులు వ్యవసాయ బోర్లకు కెపాసిటర్లను తప్పనిసరిగా అమర్చుకోవాలని, ఎలాంటి మరమ్మతులకైనా సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.