GNTR: బెట్టింగ్ అప్పుల బాధతో నెల్లూరు జిల్లాకు చెందిన రాంబాబు అనే వ్యక్తి వెలగపూడి సచివాలయ సమీపంలోని విద్యుత్ టవర్ ఎక్కి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. క్రికెట్ బెట్టింగ్లో రూ. 80 లక్షలు నష్టపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అతనికి నచ్చజెప్పి క్షేమంగా కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు.