WNP: వెనిజులా అధ్యక్షుడు మదురో దంపతుల అరెస్ట్‌ను ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కుతుబ్ తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్ట్‌కు నిరసనగా సోమవారం అమరచింతలో ఆందోళన చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న సామ్రాజ్యవాద ధోరణి ఇతర దేశాల సార్వభౌమత్వానికి ముప్పుగా మారిందని ఆయన విమర్శించారు. ఈ చర్య నిరంకుశత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.