»Most Wins In T20is India Become First Team To Get 150 Victories
T20Is: టీం ఇండియా.. అత్యధిక విజయాల అద్దిరిపోయే రికార్డు!
టీం ఇండియా అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక విజయాలను సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో మొత్తం 150 విజయాలు సాధించి, ఈ మైల్ స్టోన్‌ని చేరుకుంది.
Most Wins in T20Is : టీం ఇండియా(team India) టీ20 ప్రపంచ కప్ నెగ్గి మంచి ఊపు మీద ఉంది. అదే క్రమంలో జింబాంబ్వేపై బుధవారం మ్యాచ్ నెగ్గింది. ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటికి రెండు మ్యాచ్‌లు నెగ్గి 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో ఈ రెండు మ్యాచ్‌ల విజయం ద్వారా ఒక అద్భుతమైన ఫీట్ సాధించింది. ఇప్పటి వరకు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మొత్తం 150 విజయాలను (150 Victories) అందుకున్న తొలి జట్టుగా రికార్డు కొట్టేసింది.
భారత జట్టు ఇప్పటి వరకు మొత్తం 230 టీ20(T20) అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. అందులో అత్యధికంగా 150 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. జింబాంబ్వేపై మూడో టీ20లో విజయం సాధించడం ద్వారా ఈ మైల్ స్టోన్‌ని చేరుకోగలిగింది. భారత్ తర్వాత అత్యధిక మ్యాచ్‌లు నెగ్గిన దేశంగా పాకిస్థాన్ నిలిచింది. పాక్ ఇప్పటి వరకు 142 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో విజయం దక్కించుకుంది. అయితే భారత్‌కంటే ఎక్కువగా మొత్తం 245 అంతర్జాతీయ టీ20లు ఆడింది.
భారత్, పాక్‌ల తర్వాత ఎక్కువ విజయాలు పొందిన దేశాల వివరాలు ఇలా ఉన్నాయి. న్యూజిలాండ్ మొత్తం 220 మ్యాచ్‌లు ఆడి 111 విజయాలను దక్కించుకుంది. అలాగే ఆస్ట్రేలియా 195 మ్యాచ్‌లు ఆడి 105 విజయాలను సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా 185 మ్యాచ్‌లు ఆడి 104 విజయాలు దక్కించుకుంది. అలా ఈ దేశాలు టాప్ మూడు, నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నాయి.