SKLM: ఇచ్చాపురం ప్రాంత ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మరింత మెరుగుపడ్డాయి. పూరీ–అహ్మదాబాద్ రైలు ఈ నెల 17 నుంచి ఇచ్చాపురంలో ఆగనుంది.అలాగే న్యూజల్పాయ్గురి–తిరుచిరాపల్లి రైలుకు కూడా ఈ నెల 18 నుంచి ఇచ్చాపురం లో హాల్టు కల్పించారు. ఈ రైలును కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ కలిసి ఈ నెల 18 న ప్రారంభించనున్నారు.