»Breaking A Huge Fire Broke Out In The Khammam Cotton Market
Breaking: ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించడం వల్ల 2200 పత్తి బస్తాలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై రైతులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.
ఖమ్మం పత్తి మార్కెట్లో(Khammam Cotton Market) భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. శనివారం మధ్యాహ్నం ఖమ్మం మార్కెట్ నుంచి భారీగా మంటలు వ్యాపించాయి. మంటలు పత్తి బస్తాలకు అంటుకోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఎగసిపడుతున్న మంటల(Fire)కు అక్కడున్న పత్తి బస్తాలు ఇప్పటికే చాలా వరకూ కాలి బూడిదైపోయాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తోంది.
అగ్ని ప్రమాదం(Fire Accident)లో 2200 పత్తి బస్తాలు(Cotton Sacks) కాలిపోయినట్లు సమాచారం. భారీ మంటలకు ఆస్తి నష్టం ఎక్కువగా జరిగిందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పత్తి బస్తాలు కాలి బూడిదవ్వడంతో రైతులు(Formers) ఆందోళన చెందుతున్నారు.
మార్కెట్లో ఒక్కసారిగా మంటలు(Fire Accident) వ్యాపించడంతో అక్కడున్నవారు బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతం అంతా దట్టంగా పొగ కమ్మేసింది. పోలీసులు కేసు నమోదు(Police Case) చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం(Fire Accident) ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.