PLD: అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మాచర్ల పట్టణంలోని నెహ్రు నగర్లో శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. నెహ్రు నగర్‌కి చెందిన సుభాని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇల్లు తనఖా పెట్టి తెచ్చుకున్న అప్పులకు వడ్డీ భారం పెరగడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని సమాచారం. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.