»Fire In Air India Plane Missed Big Accident Viral Video
Viral News: ఎయిర్ ఇండియా విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం.. వైరల్ వీడియో
విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇంజన్లో మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర ల్యాండింగ్ చేశారు. లేదంటే పెనుప్రమాదం జరిగేదని సిబ్బంది చెప్పారు.
Fire in Air India plane.. Missed big accident.. Viral video
Viral News: విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇంజన్లో మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర ల్యాండింగ్ చేశారు. లేదంటే పెనుప్రమాదం జరిగేదని సిబ్బంది చెప్పారు. ఈ ఘటన బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో చోటు చేసుకుంది. ఈ ఫ్లైట్ టేక్ఆఫ్ అయిన తరువాత ఒక్కసారిగా ఇంజిన్‌లో మంటల చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించాడు. తిరిగి బెంగళూరులో ల్యాండ్ చేశాడు. ఆ సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది. పైలెట్ చర్యతో అందరికి పెనుప్రమాదం తప్పింది.
ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని వెంటనే గుర్తించకపోతే పెను ప్రమాదం జరుగుండేదని చెప్పారు. గాల్లో ఎగిరిన తరువాత కొన్ని నిమిషాలకే ఇంజిన్‌లో మంటల గుర్తించిన సిబ్బంది వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)కు చేరవేశారు. ప్రమాదాన్ని క్యాచ్ చేసిన సిబ్బంది అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బందిని రన్‌వేపై అప్రమత్తం చేశారు. అన్ని జాగ్రత్తల మధ్య విమానం ల్యాండ్ చేశారు. తరువాత ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపినట్టు అధికార ప్రతినిధి తెలిపారు. అయితే విమానంలో మంటలు చెలరేగడానికి కారణం ఏంటన్నది దర్యాప్తు జరుగుతున్నట్లు అధికారులు వివరించారు.