»Mumbai Man Dies While Playing On The Cricket Groud Due To Sudden Heart Attack
Heart Attack : క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుతో గ్రౌండ్ లోనే కుప్పకూలిన క్రికెటర్
గత కొద్దిరోజులుగా గుండెపోటు వార్తలు తరచూ వినిపిస్తన్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటన వెలుగులోకి వస్తోంది. ముంబైలోని థానేలోని మీరా రోడ్ ప్రాంతంలో తాజా కేసు వెలుగులోకి వచ్చింది.
Heart Attack : గత కొద్దిరోజులుగా గుండెపోటు వార్తలు తరచూ వినిపిస్తన్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటన వెలుగులోకి వస్తోంది. ముంబైలోని థానేలోని మీరా రోడ్ ప్రాంతంలో తాజా కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఓ ఆటగాడికి గుండెపోటు వచ్చింది. ఆడుకుంటూనే గ్రౌండ్ లో కుప్పకూలాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పడిపోయిన తర్వాత సమీపంలోని వ్యక్తులు ఆటగాడిని ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు ఆస్పత్రికి వెళ్లి చికిత్స అందించగా ఆప్పటికే అతడు చనిపోయాడు. ఈ ఘటనతో ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. ఈ ఘటన కాశీగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఒక ఆటగాడు షాట్ తీసుకున్నాడు. దీని తర్వాత అతను క్రీజులో తదుపరి బంతి కోసం వేచి ఉన్నాడు.
అది వచ్చే లోపే ఒక్కసారిగా కింద పడిపోయాడు. అతను పడిపోవడం చూసి మ్యాచ్ ఆడుతున్న ఇతర ఆటగాళ్లు అతని వైపు పరుగులు తీశారు. అంపైర్ కూడా అతనికి సహాయం చేయడానికి అతని వద్దకు వెళ్లారు. కానీ అప్పటికి చాలా ఆలస్యం అయింది. మొదట్లో ఆటగాడు మూర్ఛపోయినట్లు అనిపించింది. బహుశా తీవ్రమైన వేడి కారణంగా అతడికి ఇలా జరిగి ఉంటుందని అక్కడి వారు భావించారు. కాసేపే సపర్యలు చేసిన తర్వాత కూడా అతను స్పృహలోకి రాలేదు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అతనికి గుండెపోటు వచ్చినట్లు తేలింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినియోగదారులు విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి రావడం వైద్యులకు ఆందోళన కలిగిస్తోంది.