»Lok Sabha Election 2024 Modi Cabinet Minister Lost Election Smriti Irani Arjun Munda Mahendra Pandey Rajkumar
Election Result 2024: స్మృతి ఇరానీ మాత్రమే కాదు.. మోడీ క్యాబినెట్ కు చెందిన నలుగురు మంత్రులు ఓటమి
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 2024 లోక్‌సభ ఎన్నికలలో స్పష్టమైన మెజారిటీని సాధించింది. నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నారు.
Election Result 2024: భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 2024 లోక్‌సభ ఎన్నికలలో స్పష్టమైన మెజారిటీని సాధించింది. నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే బీజేపీ, ఎన్డీయే కూటమి పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. 400 టార్గెట్‌తో బరిలోకి దిగిన కూటమి 300 సీట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ప్రధాని మోడీ కేబినెట్లో ఉన్న నలుగురు మంత్రులు కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. వారిలో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి స్మృతి ఇరానీ, చందౌలీ నుంచి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే, బీహార్‌లోని అర్రా నుంచి రాజ్ కుమార్ సింగ్, జార్ఖండ్‌లోని ఖుంటి నుంచి అర్జున్ ముండా ఓటమి చవిచూశారు.
కిషోరి లాల్ చేతిలో ఓడిన స్మృతి
2019లో రాహుల్ గాంధీని ఓడించి ఎంపీ అయిన స్మృతి ఇరానీ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కానీ.. 2024లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. స్మృతి కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీ లాల్ చేతిలో 167196 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కిషోరి లాల్ 539228 ఓట్లు సాధించారు. కాగా, స్మృతి ఇరానీకి కేవలం 372032 ఓట్లు మాత్రమే వచ్చాయి. కిషోరి లాల్ 54.99 శాతం ఓట్లు సాధించి ఎంపీగా ఎన్నికయ్యారు. స్మృతి ఇరానీకి 37.94 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన నన్హే సింగ్ చౌహాన్ 3.52 శాతం ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.
బీరేంద్ర సింగ్ చేతిలో ఓడిన డాక్టర్ మహేంద్ర నాథ్
ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ లోక్‌సభ స్థానంపై బీరేంద్ర సింగ్ 21565 ఓట్ల తేడాతో డాక్టర్ మహేంద్ర నాథ్ పాండేను ఓడించారు. డాక్టర్ మహేంద్రనాథ్‌కు 452911 ఓట్లు రాగా, బీరేంద్ర సింగ్‌కు 474476 ఓట్లు వచ్చాయి. బీరేంద్రకు 42.5 శాతం ఓట్లు వచ్చాయి. కాగా, డాక్టర్ మహేంద్ర ఓట్ల శాతం 40.57 శాతం. బీఎస్పీ అభ్యర్థి సత్యేంద్ర కుమార్ మౌర్య 159903 ఓట్లు సాధించారు. ఆయన ఓట్ల శాతం 14.32 శాతం.
ఓటమి పాలైన రాజ్ కుమార్ సింగ్
బీహార్‌లోని అర్రా లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి రాజ్‌కుమార్ సింగ్‌పై కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి సుదామ ప్రసాద్ విజయం సాధించారు. రాజ్ కుమార్ సింగ్‌కు 457663 ఓట్లు రాగా ఆయన ఓట్ల శాతం 42.76 శాతం. కాగా, కమ్యూనిస్టు పార్టీకి చెందిన సుదామ ప్రసాద్‌కు 51,7195 ఓట్లు రాగా, ఆయనకు 48.32 శాతం ఓట్లు వచ్చాయి. సుదామ 59519 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఓడిపోయిన అర్జున్ ముండా
జార్ఖండ్‌లోని ఖుంటి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ నేత అర్జున్ ముండా కూడా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కాంగ్రెస్‌కు చెందిన కాళీ చరణ్ ముండా చేతిలో 149675 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కాళీ చరణ్ 54.62 శాతం ఓట్లతో మొత్తం 511647 ఓట్లు సాధించారు. కాగా, అర్జున్ ముండా 38.64 శాతం ఓట్లతో 361972 ఓట్లను మాత్రమే పొందగలిగారు.