Rajeev Ratan: సీనియర్ ఐపీఎస్ అధికారి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ గుండెపోటుతో మృతి చెందారు. ప్రస్తుతం రాజీవ్ రతన్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగుతున్నారు. ఈరోజు ఉదయం ఛాతినొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మృతి చెందారు. రజీవ్ రతన్ మృతి పట్ల పలువురు వ్యక్తులు సంతాపం తెలిపారు.
1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రతన్ ఇటీవల కాలంలో విజిలెన్స్ డీజీగా నియామితులయ్యారు. విజిలెన్స్ డీజీ నియమించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజీవ్ విచారణ జరిపారు. రాజీవ్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే జ్యుడీషియల్ కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. గతంలో రాజీవ్ కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. అలాగే ఆపరేషన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు.