PPM: వీరఘట్టం మండలం నడుకూరు గ్రామానికి చెందిన సాధు నారాయణమ్మ (75) అనే వృద్ధురాలు అగ్ని ప్రమాదానికి గురై శనివారం మృతి చెందింది. శుక్రవారం తన ఇంటి వద్ద చలి మంట కోసం కుంపటి పెట్టుకోగా కుంపటిలో ఉన్న అగ్గి చీరకు అంటుకోవడంతో మంటలు వ్యాపించి శరీరం మొత్తం కాలిపోయింది. క్షతగాత్రురాలను చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.