Heart Attack : చిన్న వయసులోనే గుండె పోటు ఘటనలు ఇటీవల ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతి తన సోదరి హల్దీ వేడుకల్లో భాగంగా హుషారుగా డ్యాన్స్ చేస్తోంది. ఉన్నట్లుండి గుండెల్లో నొప్పిగా అనిపించింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. ఆ యువతి పేరు రిమ్షా. వయసు కేవలం పద్దెనిమి ఏళ్లే. దీంతో ఈ వయసులో గుండె పోటుతో(Heart Attack) మరణించడంపై కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ వెడ్డింగ్(wedding) వేడుకల్లో భాగంగా ఆమె బంధువులు అందరితో కలిసి నృత్యం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గత కొన్ని సంవత్సరాలుగా చిన్న వయసులోనే గుండెపోటుతో(heart attack) మృతి చెందే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. సిద్ధార్థ శుక్లా, పునీత్ రాజ్ కుమార్, రాజీవ్ కపూర్, రాజు శ్రీవాత్సవ, రితురాజ్ సింగ్ లాంటి సెలబ్రిటీలు సైతం ఇలాగే మరణించారు. ప్రస్తుతం ఈ యువతికి సంబంధించిన వీడియో నెట్లో వైరల్‌గా మారింది.
हार्ट अटैक की समस्या लगातार बढ़ती जा रही है। ये वीडियो मेरठ के अहमदनगर की है। जहाँ शहनाई मातम में तब्दील हो गई। और हल्दी की रस्म मे डान्स कर रही युवती रिमशा की अचानक हार्ट अटैक होने से मौत हो गई।#Meerut#HeartAttackpic.twitter.com/LGThDzhYnm