»Rajasthan Sabarmati Express Collides With Goods Train
Train Accident : గూడ్స్ రైలును ఢీకొన్ని సబర్మతి ఎక్స్‌ప్రెస్
గూడ్సు రైలును ఢీకొట్టడంతో సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ రైలు ఇంజను సహా నాలుగు భోగీలు పట్టాలు తప్పాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Train Accident : రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదార్ స్టేషన్ సమీపంలో ఉన్న గూడ్సు రైలును, సబర్మతి ఎక్స్‌ప్రెస్ వెనక నుంచి ఢీ కొట్టింది. దీంతో సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఇంజన్తోపాటుగా నాలుగు భోగీలు పట్టాలు తప్పాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో పలు రైళ్లు రద్దయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టమూ చోటు చేసుకోలేదు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్లు నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్ చీఫ్ శశి కిరణ్ తెలియజేశారు. అయితే ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్లు మాత్రం రద్దయ్యాయి. మొత్తం ఆరు రైళ్లను రద్దు చేశారు. మరో రెండు రాళ్లను వేరే రూట్లకు దారి మళ్లించారు. అజ్మీర్ రైల్వే స్టేషన్ దగ్గర హెల్ప్ డెస్క్‌లను సైతం ఏర్పాటు చేశారు. 0145-2429642 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా ప్రయాణికుల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఆ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను త్వరలోనే వారి గమ్య స్థానాలకు చేరుస్తామని చెప్పారు.
ఈ ఘటనతో రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. అజ్మీర్- దిల్లీ-సరాయ్ రోహిల్లా(12065 ), అజ్మీర్- ఆగ్రా ఫోర్ట్(22987 ), అజ్మీర్-గంగాపూర్ సిటీ(09605), అజ్మీర్-రేవాడ్(09639), జైపుర్ – మార్వార్(19735 ) రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. సబర్మతి – దిల్లీ, హైదరాబాద్-హిసార్ రైళ్లను దారి మళ్లించారు.