సమాజంలో ఆడ పిల్లలకు రక్షణ కరువౌతోంది. రోజు రోజుకీ బాలికలు, మహిళలపపై అత్యాచారాలు ఎక్కువౌతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన బిడ్డ తిరిగి ఇంటికి క్షేమంగా వస్తుందా లేదా అనే భయం రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా ఓ అమాయక బాలికను ఓ సింగర్ దారుణంగా మోసం చేశాడు. కాగా, అతనిని పోలీసులు అరెస్టు చేశారు.
పాట్నా నగరంలో రాజీవ్ నగర్ ప్రాంతంలో ఓ గాయకుడు నివాసం ఉంటున్నాడు. ఆ గాయకుడు అక్కడా ఆ ప్రాంతంలో ఉండే ఓ బాలికతో పరిచయం ఏర్పరచుకున్నాడు. అలా కొన్ని రోజులు బాగానే ఉంది. ఆ పరిచయాన్ని కొంత చనువగా మార్చుకొని స్నేహం చేశాడు. స్నేహం పేరిట ఓ రోజు హోటల్ కి రమ్మని పిలిచాడు. అయితే ఎప్పటిలాగానే ఆ బాలిక తనను నమ్మి..హోటల్ కి వెళ్లింది.ఆ తర్వాత తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసాడు. ఆ బాలిక ఎంత అడ్డుకున్న తనలో మాత్రం ఇంత కూడా మార్పు లేదు. ధీంతో ఆ బాలికకు తెలియకుండా అసభ్యకర ఫోటోలు తీసుకున్నాడు. అక్కడితో అతని నిజస్వరూపం తెలుసుకున్న ఆ బాలిక తనని దూరం పెట్టుకుంటూ వచ్చింది. ఆ క్రమంలోనే నన్ను దూరం పెడతావా అనే కోపంతో ఆ బాలిక ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు.
అయితే ఒక్కసారిగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలను చూసి ఆ బాలిక కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. దాంతో ఆ బాలికను కుటుంబసభ్యులను ప్రశ్నించడం మెుదలు పెట్టారు. అక్కడితో తనపై జరిగిన మోసాన్ని తల్లిదండ్రులతో చెప్పింది. అయితే బాలిక వాంగ్మాలాలను నమోదు చేసుకున్న పోలీసులు ఆ నిందితుడిపై కేసును నమోదు చేసారు. ఆ నిందితుడు భోజ్ పురి గాయకుడు గా గుర్తించారు. వాళ్ల ఫిర్యాదు ఆదారంగా వెంటనే ఆ నిందితుడి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఆ దుర్మార్గుడిని కొన్ని గంటల్లోనే అరెస్టు చేసామని.. పోలీసు ప్రతినిధి సుభాష్ బోకెన్ తెలిపాడు. అయితే అతడిని సిటీ కోర్టులో హాజరు పరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.