CTR: గుడిపాల మండలం కృష్ణజుమ్మాపురం వద్ద ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పనులు చేస్తున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడటంతో సూరజ్ (22) అనే డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో చీలాపల్లి సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.