Ys viveka murder case: అవినాష్ రెడ్డిని 7 గంటల పాటు విచారించిన సీబీఐ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డిని కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐ ఈ రోజు విచారించింది. దాదాపు ఏడు గంటల పాటు ఆయనను ప్రశ్నించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(Ys viveka murder case)లో భాగంగా సీబీఐ(CBI) ఎదుట వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy) హాజరయ్యారు. సాయంత్రం ఐదు గంటల వరకూ ఆయన్ని విచారించారు. మొత్తంగా ఏడు గంటల పాటు సీబీఐ అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిల్ ఇస్తూ హైకోర్టు(Highcourt) పెట్టిన షరతుల మేరకు అవినాష్ రెడ్డి ప్రతి శనివారం సీబీఐ ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. కోర్టు తీర్పు మేరకు ఆయన సీబీఐ ఎదుట గత శనివారం కూడా హాజరయ్యారు.
ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు అవినాష్ రెడ్డిని సీబీఐ(CBI) ప్రశ్నించింది. గత శనివారం విచారణకు హాజరైనప్పుడే అవినాష్ రెడ్డి(Avinash Reddy) ని సీబీఐ అరెస్ట్ చేయగా రూ.ఐదు లక్షల పూచీకత్తుతో ఆయన్ని విడుదల చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సునీత కూడా కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అవినాష్ రెడ్డికి గత నెల 31న తెలంగాణ హైకోర్టు(Highcourt) ముందస్తు బెయిల్‌ను మంజూరు చేయగా తెలంగాణ హైకోర్టు తీర్పుపై సునీత సుప్రీంకోర్టులో సవాలు విసిరారు.
హైకోర్టు(Highcourt) తీర్పులో కొన్ని లోపాలున్నాయని సునీత ఆరోపించారు. అవినాష్ రెడ్డి(Avinash Reddy) ముందస్తు బెయిల్‌ను సీబీఐ సైతం వ్యతిరేకిస్తోందని పిటిషన్లో ఆమె తెలిపారు. సునీత పిటీషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంలో సీబీఐ(CBI) సైతం వాదనలు వినిపించే అవకాశం ఉంది. మరో వైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితునిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు(CBI Court) కొట్టి వేసిన సంగతి తెలిసిందే.