రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీచేసే లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించిన తర్వాత ఇడుపులపాయలో షర్మిల మాట్లాడారు. ఈక్రమంలో సీఎం జగన్‌పై ఆమె ఆరోపించారు.
YS Sharmila: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీచేసే లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించిన తర్వాత ఇడుపులపాయలో షర్మిల మాట్లాడారు. ఈక్రమంలో సీఎం జగన్‌పై ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తరపున కడప పార్లమెంట్‌కి పోటీ చేస్తున్నాను. నేను తీసుకున్న నిర్ణయం అంత సులువైంది కాదని తెలుసు. పోటీలో నేను ఉంటే మా కుటుంబం చీలిపోతుందని విషయం తెలిసినా ఈ నిర్ణయం తీసుకున్న. గత ఎన్నికల్లో షర్మిల నా చెల్లెలు కాదు.. నా బిడ్డ అని జగన్ అన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను పూర్తిగా విస్మరించారన్నారు. నా అనుకున్న వాళ్లను జగన్ నాశనం చేశారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించారు. మా చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్లకే జగన్ కడప ఎంపీ టికెట్ ఇచ్చారని షర్మిల ఆరోపించారు. వాళ్లనే వెనకేసుకొస్తున్నారు. హంతకులు తప్పించుకుని తిరుగుతున్న శిక్ష పడకుండా జగన్ వాళ్లను కాపాడుతున్నారు. చిన్నానను హత్య చేయించిన అవినాష్‌రెడ్డికి జగన్ వైసీపీకి టికెట్ ఇవ్వడం తట్టుకోలేకపోయా అని షర్మిల అన్నారు.