ఏకాగ్రత పెరుగుతుంది: ప్రాణాయామాలు, సులభమైన ఆసనాలు పిల్లల ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది: యోగా వల్ల శరీర శక్తి పెరుగుతుంది, కండరాలు బలపడతాయి, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
మానసిక స్థితి మెరుగుపడుతుంది: యోగా ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది: యోగా పిల్లలలో సెల్ఫ్-కాన్ఫిడెన్స్, సెల్ఫ్-కంట్రోల్ పెంచుతుంది.
ఇది కూడా చూడండి: Pepsico : ఇండియాలో రూ.12 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న పెప్సికో
కొన్ని ఉపయోగకరమైన యోగా ఆసనాలు , ప్రాణాయామాలు:
తాడాసన: ఈ ఆసనం బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
భస్త్రికా ప్రాణాయామం: ఈ ప్రాణాయామం మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది, చేతి, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
శీత్కారీ ప్రాణాయామం: ఈ ప్రాణాయామం శరీరాన్ని చల్లబరుస్తుంది, కోపం, అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
బ్రహ్మరీ ప్రాణాయామం: ఈ ప్రాణాయామం మనస్సును ప్రశాంతపరుస్తుంది, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుంది.
అధోముఖ శ్వనాసనం: ఈ ఆసనం శరీర బలాన్ని పెంచుతుంది, ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తుంది, రక్తప్రసరణను పెంచుతుంది.
ఇది కూడా చూడండి: Weakness in Summer: ఎండాకాలం నీరసాన్ని ఎలా అధిగమించాలి?
చిట్కాలు పిల్లలకు యోగా నేర్పడానికి ఒక శిక్షకుడి సహాయం తీసుకోవడం మంచిది. పిల్లలకు ఆసక్తికరంగా ఉండేలా యోగాను ఆటల రూపంలో నేర్పించవచ్చు. పిల్లల శక్తి స్థాయిని బట్టి యోగా సమయాన్ని నిర్ణయించాలి. యోగా చేసేటప్పుడు పిల్లలకు సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి.
Tags :