»Pepsico To Invest 1266 Crore In India Setup Manufacturing Plant In Madhya Pradesh
Pepsico : ఇండియాలో రూ.12 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న పెప్సికో
విస్తరణ ప్రణాళికలో భాగంగా మధ్యప్రదేశ్‌లో పెప్సికో ఇండియా భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఉజ్జయినిలో ఫ్లేవర్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు రూ.1,266 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.
Pepsico : విస్తరణ ప్రణాళికలో భాగంగా మధ్యప్రదేశ్‌లో పెప్సికో ఇండియా భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఉజ్జయినిలో ఫ్లేవర్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు రూ.1,266 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. 22 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ప్లాంట్ భారతదేశంలో పెప్సికో పానీయాల ఉత్పత్తిని పెంచడంలో, ఉపాధిని సృష్టించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 2024లో నిర్మాణం ప్రారంభం కానుంది. ఇది 2026 మొదటి త్రైమాసికంలో ఉత్పత్తి స్టార్ట్ కావొచ్చని భావిస్తున్నారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వ మద్దతుతో మా పరిధిని విస్తరించబోతున్నామని పెప్సికో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాగ్రత్ కొటేచా అన్నారు. ఈ కొత్త యూనిట్ భారతదేశంలో కంపెనీకి రెండవ తయారీ కేంద్రం అవుతుంది. ప్రస్తుతం కంపెనీకి పంజాబ్‌లోని చన్నోలో ఒక తయారీ కేంద్రం ఉంది. అమెరికన్ ఫుడ్ అండ్ బెవరేజీ కంపెనీ పెప్సికో వియత్నాంలో అదనంగా 400డాలర్ల మిలియన్ పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉంది. సుంటోరీ పెప్సికో వియత్నాం బెవరేజెస్తో సహా 60 కంటే ఎక్కువ అమెరికా సంస్థల ప్రతినిధులు గత వారం వియత్నాం పర్యటన సందర్భంగా ఈ నిర్ణయం వెల్లడైంది.
ప్రముఖ పానీయాల తయారీ కంపెనీ పెప్సికో నేడు అస్సాంలోని నల్బరీలో తన మొదటి ఆహార తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి రూ.778 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. 44.2 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్లాంట్‌ను 2025లో ప్రారంభించాలని ప్రతిపాదించామని, అస్సాంకు చెందిన 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే దీని లక్ష్యం అని పెప్సికో ఒక ప్రకటనలో తెలిపింది. మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి, మహిళల ఉపాధిని పెంపొందించడానికి సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడానికి అస్సాం స్కిల్ డెవలప్మెంట్ మిషన్, డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్‌తో పెప్సికో ఇండియా త్రైపాక్షిక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. కనీసం 75 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉండాలన్నది కంపెనీ లక్ష్యం.