Sanjay Singh: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు అయ్యి జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు విధించిన షరతులకు లోబడి నడుచుకోవాలని సంజయ్‌ను ఆదేశించింది. అలాగే రాజకీయ కార్యకలాపాల్లోనూ పాల్గొనేందుకు అనుమతిచ్చింది. ఈ కేసులో ఉన్న దినేశ్ అరోడాతో సంజయ్‌సింగ్‌కు పరిచయాలు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో సంజయ్ ఇంట్లో సోదాలు నిర్వహించి అతన్ని అరెస్టు చేశారు. ఈడీ కస్టడీ తర్వాత తిహార్ జైలుకు పంపించారు.
ఈ కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీమంత్రి సత్యేంద్ర జైన్, పార్టీ కీలకనేత విజయ్‌నాయర్ ఈ జైలులోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్న విషయం తెలిసిందే. సంజయ్ సింగ్ రిమాండ్ ఖైదీగా ఉంటూనే మరోసారి ఎంపీగా ప్రమాణం చేశారు. రాజ్యసభ పదవీకాలం జనవరి 27తో ముగియగా సంజయ్‌ని ఆమ్ఆద్మీ పార్టీ రెండోసారి ఎంపీగా నామినేట్ చేసింది. దిల్లీ కోర్టు ఆదేశాల మేరకు మార్చి 19న ఆయన్ని ప్రత్యేక భద్రత నడుమ జైలు అధికారులు పార్లమెంట్‌కు తీసుకెళ్లారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే మళ్లీ జైలుకు తరలించారు.