ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ పుష్ప 2 నుంచి సాలిడ్ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఫైనల్‌గా బన్నీ బర్త్ డే ట్రీట్‌గా అదిరిపోయే అప్టేట్ ఇచ్చారు.
Pushpa 2: అల్లు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న సమయం రానే వచ్చేసింది. గతేడాది ఇదే సమయానికి వేర్ ఈజ్ పుష్ప అంటూ.. భారీ హైప్ క్రియేట్ చేసిన సుకుమార్, ఈసారి అంతకుమించిన ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. 2021లో రిలీజ్ అయిన ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప-ది రూల్’ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. ఇప్పటికే పుష్ప 2 నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అందరిలో భారీ అంచనాలు పెంచేశాయి. ఇక పుష్ప 2 గురించి బిగ్ అప్డేట్ ఇస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తెలిపారు. పుష్ప మాస్ జాతర మొదలుకానుందని.. అనుకున్న సమయానికే పుష్ప 2 గ్రాండ్ రిలీజ్ అవుతుందని.. సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే ఉంది.
దీంతో ఆ రోజున పుష్ప-2 టీజర్ రిలీజ్ చేస్తున్నట్టుగా తాజాగా ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్ . ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో బన్నీ అమ్మవారి గెటప్‌లో కాలికి గజ్జె కట్టుకొని ఉన్నాడు. దీంతో బన్నీ అభిమానులు పుష్ప 2 టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం పుష్ప మాస్ జాతర, పుష్ప-ది రూల్, పుష్ప 2 టీజర్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రెండ్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఈ టీజర్ వెయ్యి కోట్లు టార్గెట్‌గా ఉంటుందని.. హై ఓల్టేజ్ యాక్షన్ కట్స్‌తో గూస్ బంప్స్ వచ్చేలా సుకుమార్ టీజర్ కట్ చేశారని అంటున్నారు. ఇక్కడి నుంచి పుష్ప హైప్ పీక్స్‌కు వెళ్లడం గ్యారెంటీ. మరి ఈసారి పుష్పరాజ్ ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి.