»Ys Sharmila Those Who Dont Do Justice To Their Own Children Do It To People
YS Sharmila: సొంత చిన్నాన్నకే న్యాయం చేయని వారు ప్రజలకు చేస్తారా?
వైఎస్ వివేక్‌ను హత్య చేసిన వాళ్లకి, చేయించిన వాళ్లకి ఇప్పటికీ శిక్ష పడలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ఆర్కు వివేకా అలాంటివారని ఆమె అన్నారు.
YS Sharmila: వైఎస్ వివేక్‌ను హత్య చేసిన వాళ్లకి, చేయించిన వాళ్లకి ఇప్పటికీ శిక్ష పడలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ఆర్కు వివేకా అలాంటివారని ఆమె అన్నారు. ప్రజల మనిషి వివేకాను ఘోరంగా చంపారు. చంపిన వాళ్లను, చంపించిన వాళ్లకు శిక్ష పడలేదు. వాళ్లంతా బయట తిరుగుతున్నారు. అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతోందని ఆమె అన్నారు. సీఎం జగన్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని హంతకులను కాపాడుతున్నారు.
హంతకులను కాపాడటం న్యాయమా? సొంత చిన్నాన్న కుటుంబానికే న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారన్నారు. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే.. హంతకుడిని కాపాడతారా? నేటి వరకు ఒక్కరోజు కూడా అవినాష్‌ను జైలుకు పంపలేదన్నారు. హంతకుడికి మళ్లీ టికెట్ ఇస్తారా? ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ, మరో వైపు హంతకుడు ఉన్నారన్నారు. ఎంపీ అభ్యర్థిగా కడప నుంచి పోటీ చేస్తున్న ఆశీర్వదించండని షర్మిల తెలిపారు.