Cancer Capital India : ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. అమెరికా, ఇంగ్లండ్ సహా భారతీయులు అత్యధికంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆసియా మొత్తంలో భారత్‌లోనే అత్యధికంగా ఈ కేసులు నమోదు అవుతున్నాయి. చెప్పాలంటే ఇది యావత్ భారతాన్ని కలవర పెట్టే అంశమే.
హెల్త్ ఆఫ్ ది నేషన్ అనే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆ నివేదిక భారతదేశం ప్రపంచంలోనే క్యాన్సర్(Cancer) రాజధాని అని పేర్కొంది. ప్రపంచ రేటుతో పోలిస్తే భారతదేశంలో పెరుగుతున్న క్యాన్సర్ రేటు చాలా ఎక్కువగా, ఆందోళనకరంగా ఉందని తెలిపింది. 2020 లెక్కల ప్రకారం చూసుకుంటే భారత్‌లో(India) మొత్తం 13 లక్షల మందికి క్యాన్సర్ ఉంది. 2025 నాటికి అది 15.7లక్షలకు పెరుగుతుంది. అంటే ఐదేళ్లలో 13శాతం మేర పెరుగుదల కనిపిస్తోంది.
చిన్న వయసులో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా భారత్ లో ఎక్కువ అవుతోంది. ఆ నివేదిక ప్రకారం… భారత దేశంలో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ సగటు వయస్సు 52గా ఉంది. అమెరికా( USA)లో ఐరోపాలో సగటు వయస్సు 63గా ఉంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ సగటు వయస్సు 59 ఏళ్లు, ఇతర దేశాల్లో సగటు వయస్సు 70 ఏళ్లుగా ఉంది. అందుకనే రానున్న రోజుల్లో భారత్ క్యాన్సర్ క్యాపిటల్‌గా మారుతుందని తెలిపింది.