»6 Surprising Health Benefits Of Olives From Cancer Prevention To Supporting Bone Health
Health benefits: ఆలివ్స్ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
ఆలివ్స్ శతాబ్దాలుగా మధ్యధరా ప్రాంతంలో ఆహారంలో భాగంగా ఉన్నాయి. వీటి రుచి కారణంగానే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఆలివ్స్ లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు , ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.
6 surprising health benefits of olives, from cancer prevention to supporting bone health
Health benefits: ఆలివ్స్ శతాబ్దాలుగా మధ్యధరా ప్రాంతంలో ఆహారంలో భాగంగా ఉన్నాయి. వీటి రుచి కారణంగానే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఆలివ్స్ లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు , ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఆలివ్స్ ఈ రోజుల్లో స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కొందరు ఆలివ్ నూనె ను వాడితే.. కొందరు డైరెక్ట్ గా ఆలివ్స్ తినడానికి ఇష్టపడతారు. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. చూడటానికి చెర్రీ పండు ఆకారంలో ఉంటుంది. ఎక్కువగా.. పిజ్జా, బర్గర్ లలో టాపికంగ్స్ గా వీటిని తింటూ ఉంటారు. కాగా.. ఈ ఆలివ్స్ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? నేషనల్ ఆలివ్ డే సందర్భంగా వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం…
ఆలివ్స్ తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు:
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: ఆలివ్ ఆయిల్ లో mono-unsaturated fats పుష్కలంగా ఉంటాయి, ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో మరియు మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
క్యాన్సర్తో పోరాడటంలో సహాయపడుతుంది: ఆలివ్స్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీస్తాయి. క్యాన్సర్తో సహా అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి.
ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: ఆలివ్స్ లో విటమిన్ K మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనవి. విటమిన్ K ఎముకల సాంద్రతను నిర్వహించడంలో సహాయపడుతుంది, కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది.
మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది: ఆలివ్ ఆయిల్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది జ్ఞాపకశక్తి , ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది: ఆలివ్ ఆయిల్ చర్మాన్ని తేమగా ఉంచడంలో , ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ముడతల సమస్యను తగ్గించి.. చర్మం అందంగా కనిపించేలా చేస్తుంది. పొడి చర్మాన్ని తగ్గించి మాయిశ్చరైజింగ్ గా ఉండేలా చేస్తుంది.
ఆలివ్లు మీ భోజనానికి రుచిని జోడించడమే కాకుండా పోషకాలు , ఆరోగ్య ప్రయోజనాలకు పవర్హౌస్ కూడా. మీ ఆహారంలో ఆలివ్లను చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది, మంటను తగ్గిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.