GNTR: కొల్లిపర మండలం తూములూరుకు చెందిన వైసీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి రాష్ట్రస్థాయి పదవి వరించింది. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఆయనను రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శిగా నియమించినట్లు గురువారం మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడించారు. పార్టీ బలోపేతానికి తనశక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.