GNTR: అమరావతి రాజధాని పనులను నాబార్డు డీజీఎం అబువురాజన్ బృందం గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రాజధాని అభివృద్ధికి నాబార్డు కేటాయించిన రూ.7,387.70 కోట్ల నిధుల వినియోగం, పనుల పురోగతిపై సీఆర్డీఏ అధికారులతో వారు సమీక్షించారు. నిర్మాణాల నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన డీజీఎం, ప్రాధాన్య క్రమంలో నిధులను ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు.