YS Suneetha: వైఎస్ వివేకాను హత్య చేసిన వాళ్లు బయటకు తిరుగుతున్నారని అయిన ప్రభుత్వం వాళ్లను ఏం చేయలేకపోతుందని ఆమె కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులు అధికారంలో ఉంటే అసలు న్యాయం ఎలా జరుగుతుంది. ఎప్పటికీ న్యాయం జరగదని సునీత అన్నారు. తనకు చదువు, తెలివి, స్థోమత ఉన్న ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా అని సునీత తెలిపారు. అవినాష్ రెడ్డి గెలవకుండా చేయడమే తన ప్రయత్నమని ఆమె తెలిపారు. తన పోరాటం రాజకీయం కోసం కాదని.. న్యాయం కోసమని ఆమె తెలిపారు.
వైఎస్ఆర్ చనిపోయిన సమయంలో జగన్ ఎంపీగా ఉన్నారు. పులివెందులలో షర్మిల లేదా విజయమ్మ పోటీ చేయాలని వివేకా చెప్పారు. ఆ సమయంలో వివేకాకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. అయితే దీనిని జగన్ వ్యతిరేకించారు. ఆ తర్వాత జగన్, విజయమ్మ కాంగ్రెస్కు రాజీనామా చేసి బయటకు వచ్చారు. 2011 ఉప ఎన్నికల్లో జగన్, విజయమ్మ పోటీ చేశారు. ఆ తర్వాత జగన్తో ఉండాలని నిర్ణయించి వివేకా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. 2014 తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అవినాష్ కుటుంబం వెన్నుపోటు పొడిచి ఓడించిందని ఆమె అన్నారు. అవినాష్ వివేకాను హత్య చేశారని.. వాళ్లను నేను నమ్మడం తన తప్పు అని సునీత అన్నారు.