»Wrestlers Protest Delhi Police Shocked Women Wrestlers Order To Submit Photos
Wrestlers Protest: మహిళా రెజ్లర్లకు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు..ఫోటోలు, ఆధారాలివ్వాలని ఆదేశం
బ్రిజ్‌భూషణ్‌పై మహిళా రెజ్లర్లు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు నోటీసులు ఇచ్చారు. లైంగిక వేధింపులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆధారాలు సమర్పించాలని రెజ్లర్లను పోలీసులు ఆదేశించారు.
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhusan Saran singh)పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. మహిళా రెజ్లర్లు(Womens wrestlers) ఆయనపై ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం కావాలని గత కొన్ని రోజులుగా మహిళా రెజ్లర్లు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు షాక్ ఇచ్చారు. తమ ఆరోపణలకు మద్దతుగా ఫోటోలను, వీడియోలను లేదా వాట్సాప్ చాట్ ను సమర్పించాలని రెజ్లర్లను పోలీసులు కోరారు. దీనికి సంబంధించి రెజ్లర్లకు సీఆర్పీసీ 91 కింద నోటీసులిచ్చారు.
బ్రిజ్ భూషణ్(Brij Bhusan)ను వెంటనే అరెస్టు చేయాలని రెజ్లర్లు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పోలీసుల దర్యాప్తును తాము విశ్వసించడం లేదని, బీజేపీ ఎంపీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని రెజ్లర్లు ఆరోపించారు. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించిన ఏడుగురు మహిళా రెజ్లర్లలో ఒక మైనర్ బాలికను తీవ్రంగా ఒత్తిడికి గురి చేసి తన ప్రకటనను మార్చుకునేలా చేశారని రెజ్లర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్రిజ్ భూషణ్(Brij Bhusan) మనుషులు కేసు పెట్టిన రెజ్లర్లను బెదిరిస్తున్నారని సాక్షిమాలిక్ ఆరోపించారు. విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని, సాక్షులను బెదిరిస్తున్నారని, అతన్ని వెంటనే అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవాలని సాక్షిమాలిక్(Sakshi Malik) డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం కాకుంటే మళ్లీ రోడ్డెక్కి తమ నిరసనను తెలియజేస్తామని రెజ్లర్లు(Wrestlers) హెచ్చరించారు.