మహబూబాబాద్ జిల్లా (Mahbubabad District) తొర్రూర్లో ఓ నకిలీ స్వామీజీ గుట్టురట్టైంది. రెండు నెలలగా ఓ మహిళను నగ్న వీడియోలు ఉన్నాయంటూ బెదిరింపులకు గురిచేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. మహిళల(women)ను తన మాయమాటలతో లోబర్చుకుని వారిని వేధిపులకు గురి చేయడం వంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. పూజల పేరుతో మహిళలను వేధిస్తున్న నకిలీ స్వామీజీని చితకబాది పోలీసులకు అప్పగించారు మహిళలు. హైదరబాద్(Hyderabad)కు చెందిన ఓ మహిళ తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని స్వామీజీని ఆశ్రయించగా.. అదే అదనుగా భావించి లోబరుచుకున్నాడు.
తర్వాత తన దగ్గర నగ్న వీడియోలు ఉన్నాయంటూ మహిళను వేధించడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు, ఫోటోలు బయటపెడతానని బెదిరించాడు. మహిళా సంఘాలను ఆశ్రయించి బాధితురాలు తన ఆవేదన వ్యక్తం చేయడంతో.. తొర్రూరు(Torrur)లో రెక్కీ నిర్వహించి స్వామీజీ(Swamiji)ని పట్టుకున్నారు మహిళలు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.ఇక అతడి వికృత చేష్టలకు తాళలేక ఆ మహిళ సంఘాలను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన మహిళా సంఘాలు (Women’s Associations) రెక్కీ నిర్వహించి మరీ ఆ దొంగ బాబాను పట్టుకుని అతడికి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత అతనని పోలీసులకు అప్పగించారు.