Minister Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ (Vidadala Rajini), వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌కు (avanthi srinivas) ఛేదు అనుభవం ఎదురైంది. విశాఖ (vizag) జిల్లా పర్యటనకు మంత్రి విడదల రజనీ (Vidadala Rajini) వచ్చారు. ఆమె ఇంచార్జీ మంత్రి కాగా.. ఈ రోజు అక్రిడెటెడ్ జర్నలిస్టుల వైద్య శిబిరం ప్రారంభించేందుకు వచ్చారు. ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్ వద్దకు వచ్చారు.
మంత్రి విడదల రజనీ (Vidadala Rajini), ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ (avanthi srinivas), అధికారులు (officials) లిప్ట్ (lift) ఎక్కారు. లిప్ట్ పరిమితికి మించి ఎక్కారు. దీంతో ఆ లిప్ట్ ఆగిపోయింది. దీంతో అధికారులు, సిబ్బంది కంగారు పెట్టారు. వెంటనే డయాగ్నొస్టిక్ సెంటర్ సిబ్బంది ఎమర్జెన్సీ కీ (emergency key) తీసుకొచ్చారు. దాని ద్వారా డోర్ తీయడంతో మంత్రి రజనీ (rajini), ఎమ్మెల్యే అవంతి (avanthi srinivas).. తదితరులు బయటకు వచ్చారు. దాంతో బయట ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.
లిప్ట్ కెపాసిటీకి (lift capacity) మించి ఎక్కడంతో సమస్య వచ్చింది. నిజానికి లిప్ట్ డోర్ మీద పర్సన్స్, కెపాసిటీ అని రాసి ఉంటుంది. దానిని ఫాలో అయితే బాగుండేది. అలా చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. చాలా మంది సేఫ్‌గా వచ్చారు. మరికొన్ని ఘటనల్లో ఊపిరి ఆడక ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా చూశాం.