Bandi Sanjay: తెలంగాణ బీజేపీలో లుకలుకలు పీక్‌కి చేరాయి. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) వర్సెస్ ఈటల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ ముదిరింది. దీంతో ఈటలను ఢిల్లీ పిలిచి, ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించారు. అయినప్పటికీ అసమ్మతి చల్లారలేదు. దీంతో తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పు అనివార్యం అని తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్‌ను (Bandi Sanjay) కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జోరుగా జరుగుతోంది.
తెలంగాణ బీజేపీ చీఫ్ బాధ్యతలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు (DK Aruna) అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈటల రాజేందర్ (etala rajender) ప్రచార బాధ్యతలు చూస్తున్న నేపథ్యంలో డీకే వైపు చూస్తున్నారు. ఈటల, డీకే.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. బండి సంజయ్ (Bandi Sanjay) వైఖరి వల్ల అసంతృప్తితో ఉన్నారు. సో.. అసమ్మతి నేతలను కూల్ చేసే ప్రయత్నాలను చేస్తారని తెలుస్తోంది. మరి బండి సంజయ్‌ను (Bandi Sanjay) కూడా కూల్ చేసేందుకు కేంద్రమంత్రి పదవీ ఆఫర్ చేశారని తెలుస్తోంది.
అధ్యక్షుడి మార్పు, బండి సంజయ్ (Bandi Sanjay) పదవీ గురించి ఇప్పటికే చర్చలు జరిగాయని సమాచారం. ఈ నెల 15వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా (amith shah) పర్యటన ఉంది. ఆ లోపు అధ్యక్షుడు మార్పు జరుగుతుందని తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చబోమని అంతకుముందు బీజేపీ నేతలు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా (nadda) స్పష్టంచేశారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఏం జరగనుందో అనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది.