ఢిల్లీ మెట్రోలో ఆకతాయిలు అల్లరి చేశారు. మెట్రో డోర్ క్లీజ్ అయ్యే సమయంలో కాలు అడ్డుపెట్టారు. అలా రెండుసార్లు చేశారు. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
Delhi Metro: ఢిల్లీ మెట్రో (Delhi Metro) తరచూగా వార్తల్లోకి వస్తోంది. ఉర్పీ జావెద్ అర్ధనగ్నంగా డ్రెస్ వేసుకోవడం వైరల్ అయ్యింది. తర్వాత మరొ యువతి కూడా అలానే డ్రెస్సింగ్ వేసుకుంది. మరొకరు పాటలు పాడి, డ్యాన్స్ చేయడంతో వైరల్ అయ్యింది. ఇప్పుడు ఇద్దరు ఆకతాయిలు చేసిన పని వెలుగులోకి వచ్చింది. మెట్రోలో (Metro) ఇద్దరు యువకులు డోర్ (door) వద్ద నిలుచున్నారు. డోర్ క్లోజ్ అయ్యే సమయంలో వీరిద్దరూ కాలితో ఆపారు. దీంతో ఒకసారి ఆగింది. మరోసారి క్లోజ్ అయ్యే సమయంలో కూడా అలానే చేశారు. అక్కడున్న కొందరు వీరిని బెదిరించలేదు. సపోర్ట్ (support) చేస్తూ.. వెకిలి నవ్వు నవ్వేశారు. ఆ వీడియోను అమన్ అనే యూజర్ ట్వీట్ చేశారు. దానికి ఢిల్లీ మెట్రోను (Metro) ట్యాగ్ చేశాడు. దీంతో వీడియో వైరల్ అవుతుంది. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు (netizens) కోరుతున్నారు. ఇలాంటి వారి వల్లే మెట్రో (metro) సర్వీస్ ఆలస్యంగా నడుస్తున్నాయని ఓ యూజర్ (user) అన్నారు. వీరిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని మరొకరు అడిగారు. చాలా మంది నెటిజన్లు (netizens) అసహనం వ్యక్తం చేశారు. మరికొందరు ఫన్నీ మీమ్స్ పెట్టారు. ఆ కోచ్ నంబర్ ఇవ్వాలని డీఎంఆర్సీ స్పందించింది. కొందరు యూజర్లు మండిపడ్డారు. వీడియో (video) చూస్తే కనిపించడం లేదా.. బ్లూ లైన్ కనిపిస్తోంది కదా.. రైలు సీసీ కెమెరా ఉంటాయి కదా.. వాటిని చూడలేరా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలాంటి వారి వల్ల మెట్రో సేవలు (metro) ఆలస్యం అవుతాయి. ప్రతీ స్టేషన్ (station) వద్ద ఇలాంటి వారు ఉంటే మెట్రో రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతాయి. సో.. వారిని గుర్తించి కేసు నమోదు చేయాలని కోరుతున్నారు.