ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ మృతి చెందారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలుపుతున్నారు.
ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ(Mulugu Brs)లో తీవ్ర విషాదం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్(Mulugu ZP Chairman Kusuma jagadish) గుండెపోటు(Heart Attack)తో మృతిచెందారు. హన్మకొండలోని అజార హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణం పట్ల సీఎం కేసీఆర్(CM KCR) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కుసుమ జగదీష్ అకాల మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.
కుసుమ జగదీష్(Mulugu ZP Chairman Kusuma jagadish) తెలంగాణ ఉద్యమకారుడిగా ఆనాటి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గానూ జగదీష్ సేవలు అందించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను సీఎం కేసీఆర్(CM KCR) స్మరించుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. కుసుమ జగదీష్ కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని సీఎం కేసీఆర్ తెలిపారు.