Telugu boy got a chance in Team India. టీమిండియాలో తెలుగు కుర్రాడికి చోటు దక్కించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన కేఎస్ భరత్ కి టీమిండియాలో చోటు దక్కించుకోవడం పట్ల ఆమె తల్లి సంతోషం వ్యక్తం చేశారు.
దాదాపు మూడు నెలల పాటు పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పేదలు, మధ్య తరగతి ప్రజలకు అద్దె బస్సులను అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంచుతోంది. ఈ ఆఫర్లతో ఆర్టీసీ సేవలను వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి చర్యలతో నష్టాల్లో ఉన్న సంస్థ లాభాల బాటలోకి పయనిస్తోంది.
ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన శుద్ధ దండగ అని, ప్రతిపక్షాలు విసిరే బురదలోనూ కమలం వికసిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో వ్యాఖ్యానించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ పాలనపై ఆయన నిప్పులు చెరిగారు.
హైదరాబాద్ లో సరికొత్త క్రీడా సంబరం జరుగుతుండడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ స్థాయి నగరంగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ లో ఇలాంటి క్రీడా ఉత్సవం జరుగడంతో భాగ్యనగరానికి మరో కీర్తి లభించనుంది.
టర్కీ, సిరియా దేశాల్లో ఇటీవల భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. కాగా.... ఈ భూకంప ధాటికి దాదాపు 15వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాలు కలిపి 15,383 మంది చనిపోయారంటూ అధికారులు చెబుతున్నారు. అయితే... అంతకన్నా... ఎక్కువ మందే చనిపోయి ఉంటారని తెలుస్తోంది.
రూ.264 కోట్ల ఐటీ స్కామ్‌లో జీఎస్టీ ఇన్‌స్పెక్టర్ నుండి నటిగా మారిన కృతిని (Kriti Verma) ఈడీ (Enforcement Directorate) విచారించింది. తన సీనియర్ల లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా వందల కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
సింగరేణిని ప్రయివేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వం కుట్రను తాము భగ్నం చేస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఇప్పటికే బొగ్గు గనుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రధాని మోడీ, కేంద్రమంత్రులకు లేఖ రాసినట్లు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో(telugu states) మళ్లీ ఎన్నికల సందడి మొదలు కానుంది. అందేంటీ అనుకుంటున్నారా. అవును రెండు రాష్ట్రాల్లోని 15 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించేదుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న 9 స్థానాలతోపాటు ఖాళీ కానున్న 6 స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్(MLC elections Schedule 2023) ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవ...
ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం, అతిపెద్ద మల్టీమీడియా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ(Disney )సంస్థ 7,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాబ్ ఐగెర్(Bob Iger) బుధవారం నాడు ఈ మేరకు ప్రకటించారు. డిస్నీ కంపెనీ తన పని నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడం, ఖర్చులను తగ్గించడానికి ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. తిరిగి రాగానే.. అమెరికా సహా ప్రపంచవ్య...
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రామశివారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ అని, తనకు మేలు జరిగేలా ఆయన మాట్లాడించారని ఎద్దేవా చేశారు. మరో ఆరు నెలల తర్వాత ఏపీలో మరిన్ని చాలా చిత్రాలు, విచిత్రాలు చూస్తారన్నారు.
దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో ఈడీ(ED), సీబీఐ(CBI) అధికారులు స్పీడ్ పెంచారు. నిందితులను క్రమంగా అదుపులోకి తీసుకుంటూ మరికొంత మందిని అరెస్టు చేస్తున్నారు. బుధవారం(ఫిబ్రవరి 8న) ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, BRS ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్న కాసేపటికే గౌత...
రోజురోజుకు చీటింగ్ మోసాలు ఎక్కువవుతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన పలువురు యువత ఇంకొంత మందిని మోసం చేసి డబ్బులు దండుకుంటున్నారు. అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. దుమ్ముయిగూడకు చెందిన నవీన్ అనే యువకుడు కొంతమందిని చీట్ చేసి సుమారు రూ.5 కోట్ల మేర దోచుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే ఓ మొబైల్ షో రూంలో క్యాషీయర్ గా పనిచేస్తున్న నవీన్ మొదట తన స్నేహితులకు కమిషన్ తీసుకోకుండా క్ర...
ముఖ్యమంత్రి జగన్ పాలనా ప్రభావం వచ్చే పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ పైన ఉంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపడనికి కేవలం పదేళ్లు చాలని చెప్పారు.
Chandrababu Naidu Shocking Comments on AP Elections. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని స్పస్టం చేశారు. ఏ క్షణంలో అయినా సీఎం వైఎస్ జగన్ ముందస్తుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణుల...
సింగర్ యశస్వి కొండేపూడి (Yasaswi Kondepudi) వివాదంలో ఇరుక్కున్నారు. కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్ (Navasena Foundation) అతనిపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఫౌండేషన్ తనది అని అతను చెప్పుకుంటున్నాడని, ఆయన మోసం చేశారని నిర్వాహకురాలు ఫరా (farah) ఆరోపించారు.