• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఘనంగా శ్రీ కోదండరామయ్య కళ్యాణం

NLR: నగరంలోని మా గుంట లేఔట్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అనంతరం ప్రత్యేక పుష్ప అలంకరణతో, మంగళ వాయిద్యాలు, వేద పండితుల నడుమ శ్రీ కోదండ రామయ్య కల్యాణ కార్యక్రమం వైభవంగా జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి ఈ కల్యాణ కార్యక్రమాన్ని తిలకించారు.

March 28, 2026 / 09:00 PM IST

రూ.13:50 లక్షలకు బెల్లంపల్లి కూరగాయల సంత వేలం

MNCL: బెల్లంపల్లిలోని కూరగాయల(2025-26) సంతను బహిరంగ వేళలో పసుల వెంకటేష్ దక్కించుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి తెలిపారు. కమిషనర్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన బహిరంగ వేలంలో నలుగురు పాటదారులు పాల్గొన్నారు. పసుల వెంకటస్వామి రూ.13.50 లక్షలకు వేలం పాడి తైబజార్ నిర్వహణను దక్కించుకున్నట్లు కమిషనర్ వివరించారు.

March 28, 2026 / 09:00 PM IST

ఇండస్ట్రియల్ పార్కును రద్దు చేయాలని వినతి

VKB: ఇండస్ట్రియల్ పార్కు కోసం పేద రైతుల భూములను లాక్కోవడాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ దీపక్ తివారీని కలిసి రైతులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. అన్నం పెట్టే రైతుల భూములు కాకుండా, ప్రభుత్వ బంజరు భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల పొట్ట కొట్టడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

March 28, 2026 / 08:59 PM IST

పట్టణ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తాం: ఛైర్మన్

SRPT: నేరేడుచర్ల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ వెంకటరెడ్డి అన్నారు. ‘ప్రజా పాలన -99 రోజుల ప్రణాళిక’లో భాగంగా శనివారం వైస్ ఛైర్మన్ సందీప్ రెడ్డితో కలిసి పాత నేరేడుచర్ల, విద్యా నగర్లోని శ్మశాన వాటికల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రతి వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

March 28, 2026 / 08:59 PM IST

RCB vs SRH: ఐదో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

IPL 2026లో RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో 137 పరుగుల వద్ద హైదరాబాద్ 5వ వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో (14.3) సలీల్ అరోరా (9) వెనుదిరిగాడు. అంతకుముందు షెఫర్డ్ బౌలింగ్‌లో (13.1) ఫిల్‌సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి క్లాసెన్ (31) ఔటయ్యాడు. ప్రస్తుతం 15 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఇషాన్ (74*) అనికేత్ (5*) క్రీజులో ఉన్నారు.

March 28, 2026 / 08:58 PM IST

రాష్ట్రంలో నా మార్క్ చూపించా: బీజేపీ చీఫ్

AP: BJPలో ఓ మార్క్ తీసుకురాగలిగానని బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. విస్తృత కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లామని తెలిపారు. సారథ్యం పేరిట రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేశామని చెప్పారు. వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని వెల్లడించారు. అన్ని ప్రాంతాల్లో పార్టీ ప్రభావం పెంచే చర్యలు తీసుకున్నామని వివరించారు.

March 28, 2026 / 08:55 PM IST

BNS చట్టాలపై అవగాహన కల్పించిన పోలీసులు

కడప జిల్లాలో మహిళల రక్షణే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు గ్రామాలు, కాలనీలు, పట్టణాల్లో మహిళలు, బాలికలతో సమావేశాలు ఏర్పాటు చేసి భద్రత, చట్టాలు, సైబర్ నేరాలపై వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ నంబర్లను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.

March 28, 2026 / 08:52 PM IST

వీధి కుక్కల దాడిపై NHRC ఫిర్యాదు

NLG: భువనగిరి తారకరామ నగర్‌లో నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి ఘటనపై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపిస్తూ న్యాయవాది వినోద్ ఈ ఫిర్యాదు చేశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే బాధితుడి కుటుంబానికి తగిన ఆర్థిక నష్టపరిహారం అందేలా చూడాలని ఆయన కోరారు.

March 28, 2026 / 08:50 PM IST

బాలసదనం, వృద్ధాశ్రమాన్ని తనిఖీ

NRPT: నారాయణపేట పట్టణంలోని బాలసదనం, వృద్ధాశ్రమాన్ని శనివారం సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించారు. సిబ్బందికి భోజనం నాణ్యమైనది ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పిల్లలు, వృద్ధులతో సమస్యలు తెలుసుకుని అనంతరం పండ్లు పంపిణీ చేశారు.

March 28, 2026 / 08:50 PM IST

మాజీ మంత్రిని కలిసిన బార్ అసోసియేషన్ నూతన కార్యదర్శి

ADB: ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన కేమ శ్రీకాంత్ శనివారం ఆదిలాబాద్‌లోని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రామన్న, కేమ శ్రీకాంత్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెనగంటి ప్రకాష్‌తో పాటు పలువురు ఉన్నారు.

March 28, 2026 / 08:50 PM IST

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

NZB: నగర శివారులోని సారంగాపూర్ పరిధిలో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు సీపీ సాయి చైతన్య ఆదేశాలతో, సీసీఎస్ ఇన్‌ఛార్జ్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో తన సిబ్బందితో కలిసి శనివారం దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్టు చేయగా, వారి నుంచి 7 సెల్ ఫోన్లు, రూ. 5300 నగదును స్వాధీన పరుచుకున్నారు.

March 28, 2026 / 08:50 PM IST

PHCలో ప్రత్యేక వైద్య శిబిరం: డాక్టర్ సృజన్

KMR: నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో ఈ నెల 30న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు డాక్టర్ సృజన్ కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని ఆయన వివరించారు. స్థానికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 28, 2026 / 08:50 PM IST

అంత్యక్రియలకు రూ. 41,500 ఆర్థిక సహాయం

SRD: నారయణ ఖేడ్ మండలం వెంకటాపూర్ కు చెందిన నిరుపేద చాకలి అంజయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వీరి కుటుంబ పరిస్థితులను గ్రామస్తులు గుర్తించి, శనివారం అంత్యక్రియల నిమిత్తం మానవతా దృష్టితో చందాలు వేసుకున్నారు. గ్రామస్తులు పోగుచేసిన రూ.41500 ఆర్థిక సహాయాన్ని స్థానిక సర్పంచ్, గ్రామ పెద్దలు కలిసి మృతుడి భార్యకు అందజేశారు.

March 28, 2026 / 08:48 PM IST

వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు అందజేత

NLG: నల్గొండ మండల పరిషత్ కార్యాలయంలో వార్డు సభ్యులకు చేపట్టిన శిక్షణ శనివారం ముగిసింది. MPDO యాకూబ్ నాయక్ మాట్లాడుతూ.. పంచాయతీ వ్యవస్థలో వార్డు సభ్యుల బాధ్యతలు కీలకమని, గ్రామాభివృద్ధిలో సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 16 మంది వార్డు సభ్యులకు ఆయన సర్టిఫికేట్లను అందజేశారు.

March 28, 2026 / 08:47 PM IST

పెనుకొండలో పర్యటించనున్న మంత్రి సవిత

సత్యసాయి: పెనుకొండలో ఆదివారం మంత్రి సవిత పర్యటించనున్నట్లు పెనుకొండ అర్బన్ కన్వీనర్ శ్రీరాములు తెలిపారు. పెనుకొండలోని టీడీపీ కార్యాలయంలో నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ  ఆదివారం పెనుకొండలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి నివాళులర్పిస్తారని తెలిపారు. అనంతరం ఎంఐజి లేఔట్ రూ.16.6 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి భూమి పూజ చేస్తారన్నారు.

March 28, 2026 / 08:47 PM IST