సత్యసాయి: పెనుకొండలో ఆదివారం మంత్రి సవిత పర్యటించనున్నట్లు పెనుకొండ అర్బన్ కన్వీనర్ శ్రీరాములు తెలిపారు. పెనుకొండలోని టీడీపీ కార్యాలయంలో నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ ఆదివారం పెనుకొండలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి నివాళులర్పిస్తారని తెలిపారు. అనంతరం ఎంఐజి లేఔట్ రూ.16.6 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి భూమి పూజ చేస్తారన్నారు.