JGL: లోక్ అదాలత్లతోనే కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తోందని సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు అన్నారు. మెట్‌పల్లి మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. కక్షిదారుల ప్రయోజనాల కోసమే లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. కక్షిదారులు పరస్పరం రాజీపడటం ద్వారా డబ్బుతోపాటు సమయం ఆదావుతుందన్నారు.
CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నిత్య అన్నదానం ట్రస్ట్‌కు మియాపూర్ (హైదరాబాద్)కు చెందిన మాధవి రూ. 1,00,116 విరాళం అందించారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరికి మూషిక మండలంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
TPT: సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 30న తిరుపతికి ఒకరోజు పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో, నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, “డయల్ యువర్ కమిషనర్” కార్యక్రమాలను రద్దు చేసినట్లు కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
KMM: జిల్లా కోర్టుతో పాటు సత్తుపల్లి, మధిర కోర్టుల్లో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో మొత్తం 6,500 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా న్యాయ సేవాధికారీ M.కల్పన తెలిపారు. ఈ కేసుల్లో సివిల్ కేసులు 2,730, సివిల్ కేసులు 37, చెక్ బౌన్స్ కేసులు 48, కుటుంబ తగాదా కేసులు 10, మోటారు ప్రమాద కేసులు 85, డ్రంకెన్ డ్రైవ్ కేసులు 3,544, లిటిగేషన్ కేసులు 46 ఉన్నాయన్నారు.
AP: తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి ఏప్రిల్ 1 వరకు మూడు రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. వసంతోత్సవాల సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకు ప్రత్యేకంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. భక్తులు ఈ మార్పులను గమనించాలని టీటీడీ కోరింది.
W.G: గోదావరి పుష్కరాలకు నరసాపురంలో సుమారు రూ.240 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు మున్సిపల్ ఆర్డీ సీహెచ్.నాగ నరసింహరావు తెలిపారు. శనివారం నరసాపురం గోదావరి ఏటిగట్టును ఆయన పరిశీలించారు. ఈ ప్రతిపాదనలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించామన్నారు. అనుమతి రాగానే టెండర్లు పిలిచి పనులు చేపడతామని ఆయన తెలిపారు.
PDPL: కేంద్ర ప్రభుత్వ PMKVY 4.0తో పాటు రాష్ట్ర ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా RGM ప్రభుత్వ ITIలో స్వల్పకాలిక శిక్షణ కోర్సులు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సురేందర్, శిక్షణాధికారి విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. CNC టర్నింగ్, 3D ప్రింటింగ్‌తో పాటు ATC కింద15 రోజుల ఆధునిక కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత, 18 సంవత్సరాలు పూర్తయిన దరఖాస్తు చేసుకోవన్నారు.
వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై దాడి జరిగింది. పట్టణంలోని జంగాల గుట్టకు చెందిన మండ్ల వెంకటేష్‌పై అతని బామ్మర్ది గుజ్జుల ఎల్లయ్య శుక్రవారం నాగవరం కల్లు దుకాణం వద్ద అకారణంగా గొడవపడి, కల్లు సీసాతో దాడి చేశాడు. ఈ ఘటనలో వెంకటేష్ రక్తగాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
BDK: భద్రాచలంలో ఉన్న జాబిల్లి హాస్పిటల్, రాధ హాస్పిటల్లను DMHO డా.తుకారామ్ రాథోడ్ ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ఆసుపత్రుల పనితీరు, అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించిన డీఎంహెచ్‌వో ఆసుపత్రి యాజమాన్యాలకు పలు సూచనలు చేశారు. రోగుల సౌకర్యార్థం సేవల చార్జీలు, అందుబాటులో ఉన్న వైద్య సేవలు ప్రదర్శించేలా ఏర్పాటు చేయాలన్నారు.
SRCL: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించిన ‘తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్’లో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఈ క్రీడా వేడుకల్లో మంత్రులు, సహచర శాసనసభ్యులతో కలిసి ఆయన క్రీడాస్ఫూర్తిని చాటారు. ముఖ్యంగా టగ్ ఆఫ్ వార్, కబడ్డీ పోటీల్లో పాల్గొని అందరిని అలరించారు.
NLR: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈనెల 29, 30వ తేదీల్లో నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి మనోహర్ 29వ తేదీ రాత్రి 10 గంటలకు నెల్లూరుకు చేరుకొని బస చేస్తారు. అనంతరం 30వ తేదీన కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తారు. తదుపరి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షలో పాల్గొంటారని పలువురు అధికారులు తెలిపారు.
WGL: వర్ధన్నపేట పట్టణంలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని బజరంగ్ దళ్ సభ్యులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఏడు ఆవులను వధశాలకు తీసుకెళ్తుండగా బృందం అడ్డుకుని తనిఖీ చేసింది. అనుమతి పత్రాలు లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
నల్గొండ పట్టణంలో నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు సంస్థ ఏడీఈ వేణుగోపాలచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు, భారత్ గ్యాస్ గోదాం ఏరియాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం నెలకొంటుందని వివరించారు. ఈవిషయం గుర్తించి విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు.
NDL: దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి డా. యం.హరి జవహర్ లాల్ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదాశీర్వచనాలు అందజేసి, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలు, చిత్రపటంతో సత్కరించారు.
ADB: బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో ఏప్రిల్ 6న నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేయాలని డిప్యూటీ CM భట్టి విక్రమార్క ఆదేశించారు. ఏప్రిల్ 6న ఉదయం 11 గంటలకు CM బాసరకు చేరుకుని పూజలు నిర్వహిస్తారు. అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని, మధ్యాహ్నం 2 గంటలకు పిప్పిరి చేరుకుని సభలో ప్రసంగిస్తారు.