JGL: రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్‌కు పెద్దపీట వేస్తూ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. ఏటీసీలో శిక్షణ పొందిన విద్యార్థులు చెక్కపై రూపొందించిన తన చిత్రాన్ని ఆయనకు అందజేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 15 రోజుల్లో 6 బ్యాచ్‌లకు కోర్సులు అందిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
AP: రాష్ట్రాన్ని విభజించినప్పుడు అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. తెలంగాణ వేరు, ఆంధ్రా వేరు అనే భావన తమకు ఎప్పుడూ లేదన్నారు. ఏపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది తెలంగాణలో పుట్టి పెరిగినవాళ్లు ఉన్నారన్నారు. వాళ్ల మనసులో నుంచి తెలంగాణ ప్రాంతీయత భావనను తీసేయలేమన్నారు.
PDPL: ధర్మారం మండలం నల్లలింగయ్యపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో ఇద్దరు కాంప్లెక్స్ స్థాయిలో ఎంపికై, అనంతరం ఇంగ్లీష్ విభాగంలో జిల్లా స్థాయికి అర్హత సాధించారు. ఈ విజయాన్ని అభినందిస్తూ ఎంఈవో పాఠశాలను సందర్శించి విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీర్పాల్, ఉపాధ్యాయుడు శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
KRNL: పెద్దకడబూరులో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇవాళ జరిగిన బయోలాజికల్ సైన్స్ పరీక్షకు KGBV పాఠశాలలో 135 మందికి గానూ 133 మంది హాజరు కాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. AP మోడల్ స్కూల్‌లో 257 మందికి గాను 249 మంది హాజరు కాగా, 8 మంది గైర్హాజరయ్యారు. ZP పాఠశాల 254 మందికి గాను 249 మంది హాజరు కాగా, ఐదుమంది గైర్హాజరైనట్లు MEO భాషా తెలిపారు.
KNR: సైదాపూర్ రైతు వేదికలో 5 రోజులుగా జరుగుతున్న తొలి విడత వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో 14 గ్రామాలకు చెందిన 122 మంది వార్డు సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ పథకాల అమలు, పారిశుద్ధ్యం, వార్డు సభ్యుల విధులు, తదితర కీలక పరిపాలనా అంశాలపై వీరికి నిపుణులు అవగాహన కల్పించారు.
SKLM: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం కలిశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ఇద్దరు నాయకులు చర్చించారు. ఈ సందర్భంగా తమ తమ నియోజకవర్గాల అభివృద్ధి పనులు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు.
రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ‘ధురంధర్ 2’ ఇప్పటికే రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ సిరీస్‌లోని రెండు భాగాలు కలిపి ఏకంగా రూ.2400 కోట్లు కొల్లగొట్టడం విశేషం. దీంతో ‘పుష్ప’ సినిమాల కలెక్షన్ల రికార్డులను ధురంధర్ బద్దలు కొట్టింది. రణ్‌వీర్ కెరీర్‌లో ఇదొక మైలురాయిగా...
BDK: న్యాయవాదుల సంక్షేమానికి నూతన కమిటీ నిరంతరం కృషి చేయాలని న్యాయమూర్తి వసంత్ పాటిల్ కోరారు. భద్రాద్రి జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు శనివారం జిల్లా జడ్జి వసంత్ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్జికి పూల మొక్కలు అందజేసి తమ కమిటీ సభ్యులను పరిచయం చేసుకున్నారు.
W.G: భీమవరం ఫిట్ జోన్ జిమ్‌లో దాసరి చందు మిత్రబృందం శనివారం వికలాంగ మహిళకు వీల్ చైర్ అందజేశారు. విజ్ఞాన వేదిక అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. చందు యువకులకు బాడీ బిల్డింగ్‌తో పాటు సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా భాగస్వాములను చేయటం అభినందనీయం అన్నారు. చందు మాట్లాడుతూ.. కొత్త పూసలమర్రుకు చెందిన కనుమూరి విజయలక్ష్మికి ఈ వీల్ చైర్ అందజేశామన్నారు.
TG: అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారు. రాఘవ కన్ స్ట్రక్షన్‌పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వెల్‌లోకి సభ్యులు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.
SDPT: చిన్నకోడూరు మండలం రామంచ ప్రాథమిక పాఠశాలను శనివారం జిల్లా స్థాయి ప్యానల్ తనిఖీ బృందం పద్మారెడ్డి, నాగేందర్, లక్ష్మీనారాయణ సందర్శించారు. ఈ సందర్బంగా పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలను, ఉపాధ్యాయుల మోడల్ లెసన్స్, విద్యార్థుల అభ్యసన స్థాయిని, పాఠశాల రికార్డులు, హాజరు నమోదు, విద్యా ప్రణాళికలను పరిశీలించారు.
IPL 2026 సీజన్‌కు రంగం సిద్ధమైంది. అయితే, అబ్రార్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంతో ఇటీవల సన్‌గ్రూప్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎఫెక్ట్ ఏమైనా ఇప్పుడు SRHపై పడుతుందా? అని పలువురు ఆందోళన చెందుతున్నారు. అయితే, అలాటిందేమీ ఉండదని భారత మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా తెలిపింది. అతడేమీ భారత్‌కు రావడంలేదు కదా అని చెప్పుకొచ్చింది.
VKB: బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల గ్రామంలోని 1వ వార్డులో ఎంపీ డీకే అరుణ సాకారంతో మంజూరైన రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను శనివారం ప్రారంభించారు. 4వ వార్డు సభ్యుడు రాజు నాయక్ ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఎంపీ సహకారంతో గ్రామాభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, బీజేపీ నాయకులు, పాల్గొన్నారు.
వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరిచేందుకు పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో 92 శాతం నీరు ఉండటం వల్ల డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. విటమిన్ సి, ఎ, లైకోపీన్ వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది సరైన ఆహారం.
TG: సింగరేణిలో మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. డిపెండెంట్ కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. భూపాలపల్లిలో ధర్నా నిర్వహించిన కార్మికులు.. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న రూ.51,000 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.