KKD: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-19 బాలుర క్రికెట్ క్రీడాకారుల ఎంపికలు ఏప్రిల్ 1న కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల క్రికెట్ మైదానంలో నిర్వహించనున్నట్లు సంఘ అధ్యక్ష, కార్యదర్శులు తలాటం హరీష్, నక్కా వెంకటేష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1, 2007 ఆ తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు.
VZM: గజపతినగరంలోని సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు వేదుల భువనేశ్వర ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో అర్చకులు చంద్రమౌళి శర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామ పట్టాభిషేకాన్ని భక్తులు తిలకించారు.
SS: నల్లమాడ మండలం దొన్నికోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు హుండాయ్ మొబిస్ ఇండియా సంస్థ CSR కింద భారీ విరాళం అందజేసింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యంగ్ యుయోంగ్ జూక్ ఆధ్వర్యంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు కోసం 20 కంప్యూటర్లు, టేబుళ్లు, కుర్చీలతో పాటు ఫ్యాన్లు, లైట్లను పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయురాలు గీత, ఉపాధ్యాయ బృందం సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
AP: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి మంత్రి నారాయణ ఆమోదం తెలిపారు. 2014-19 TDP హయాంలో అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న జగన్.. ఆ తర్వాత మాట మార్చారని విమర్శించారు. తమ పాలనలో జగన్.. రాజధానిపై దుష్ప్రచారం చేసినా ప్రజలు తగ్గలేదని పేర్కొన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి పునర్నిర్మాణ పనులను వేగవంతం చేశామని గుర్తుచేశారు.
MHBD: నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్ సింగారం నాగేంద్ర ప్రసాద్- స్వర్ణలత దంపతుల కుమారుడు సింగారం దీక్షిత్ 9వ తరగతి చదువుతున్నాడు. నిన్న జరిగిన శ్రీరామనవమి పండుగ సందర్భంగా తన చిత్రకళను ప్రదర్శించి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి చిత్రాలను చిత్రకరించి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. దీక్షిత్‌ను పలువురు అభినందిస్తున్నారు.
WGL: చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామానికి చెందిన ముదిరాజులు శనివారం ఉదయం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా.గోగుల రాణాప్రతాప్‌ను కలిశారు. తమ కుల బంధువులు జరుపుకునే గ్రామ పెద్దమ్మ తల్లి దేవత ప్రతిష్ఠ, యంత్రబలం, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావాలని వారు రాణాప్రతాప్‌ను ఆహ్వానించారు. ఈమేరకు ఆహ్వానపత్రిక అందజేశారు.
KNR: WGL-KNR రహదారిపై కేశవపట్నం వద్ద ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న కారు దాన్ని ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. అదే సమయంలో కారు వెనుక ఉన్న మరో లారీ వేగంగా వచ్చి కారును బలంగా ఢీకొట్టిందన్నారు. ఈ ఘటనలో 2 లారీల మధ్య ఇరుక్కుపోయిన కారు ముందు, వెనుక భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయన్నారు.
KMM: రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూరగాయలు పండించే రైతులకు ప్రత్యేక గుర్తింపు కల్పిస్తూ ‘కిసాన్ ఐడీ కార్డులు’ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్డుల ద్వారా రైతులకు సాగు రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు సులభతరం చేయడంతో పాటు పలు ప్రోత్సాహకాలు అందించనున్నారు.
NZB: పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్మూర్ మండలం అంక్సాపూర్‌లో ఐస్ క్రీమ్ ఆటోలు, బండ్ల ప్రవేశాన్ని నిషేధించినట్లు గ్రామ సర్పంచ్ ప్రకటించారు. నిబంధనలు అతిక్రమించి గ్రామంలో ఐస్ క్రీమ్ విక్రయిస్తే రూ. 5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మన ఊరి పిల్లల ఉజ్వల భవిష్యత్తు, ఆరోగ్య పరిరక్షణ కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టం చేశారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలో శనివారం స్వర్ణ ఆంధ్ర–స్వేచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఎస్సై సందీప్ కుమార్ పోలీస్ సిబ్బందితో కలిసి ఒంగోలు బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయ వద్దన్నారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలో శనివారం స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఎస్సై సందీప్ కుమార్ పోలీస్ సిబ్బందితో కలిసి ఒంగోలు బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయ వద్దన్నారు.
ఉమ్మడి ప.గో. జిల్లాలోని కీలకమైన నరసాపురం పోలీస్ సబ్ డివిజన్‌కు గత కొంతకాలంగా పూర్తిస్థాయి డీఎస్పీ లేక వెలవెలబోతోంది. ఫిబ్రవరి 26న డాక్టర్ శ్రీవేద బదిలీ అయినప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. పది పోలీస్ స్టేషన్ల పరిధిలోని శాంతిభద్రతల పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కీలకమైన ఈ సబ్ డివిజన్‌కు వెంటనే అధికారిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.
ATP: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేయాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పిలుపునిచ్చారు. మార్చి 29న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని కోరారు. పాత జెండా దిమ్మెలను శుభ్రం చేసి, అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు.
శ్రీకాకుళం: మందస పట్టణంలోని శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న పురుషోత్తమ స్వామి శనివారం ఆకస్మికంగా మరణించారు. ఆయన ఆలయ అర్చకులుగా సేవలందించారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆయన చూపిన భక్తిశ్రద్ధలు భక్తులను ఆకట్టుకున్నాయి. చిన జీయర్ స్వామికి ప్రియ శిష్యులలో ఒకరుగా గుర్తింపు పొందిన పురుషోత్తమ స్వామికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
శ్రీకాకుళం: లావేరు మండలం బుడుమూరు గ్రామంలో శనివారం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు సామూహిక అభివృద్ధితో పాటు వ్యక్తిగత సమస్యలపై అర్జీలు సమర్పించారు. ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు.