• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వైసీపీలో చేరిన తెలుగుదేశం కార్యకర్తలు

కోనసీమ: కపీలేశ్వరపురం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాతపూడి గ్రామ అధ్యక్షులు భూల వీరబాబు ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగుదేశంకు చెందిన 25 మంది బీసీ కార్యకర్తలు మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ పార్టీ కండువాలు వేసి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

March 28, 2026 / 08:47 AM IST

విద్యుత్ కాంతులతో వేంకటేశ్వరుని ఆలయం ముస్తాబు

MBNR: కౌకుంట్ల మండలం వెంకటగిరిలో శనివారం లక్ష్మీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరగనుంది. ఈ వేడుక కోసం ఆలయాన్ని విద్యుత్ దీపాలు, కాషాయ తోరణాలతో సుందరంగా అలంకరించారు. ఉదయం 11:00 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగే ఈ దివ్య ఘట్టాన్ని భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శించుకోవాలని నిర్వాహకులు కోరారు.

March 28, 2026 / 08:45 AM IST

మంచు దిబ్బల్లో ఘోరం.. ఏడుగురు మృతి

లడఖ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై వాహనాలు వెళ్తుండగా మంచు పెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి మృతిచెందినట్లు ద్రాస్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్‌డీఎం)విశాల్ అత్రి తెలిపారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ‘X’ వేదికగా స్పందిస్తూ.. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరిందని, మరో ఐదుగురు గాయపడ్డారని పేర్కొన్నారు.

March 28, 2026 / 08:45 AM IST

శోభాయాత్రలో కళాకారుల సందడి

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో కళాకారులు సందడి చేశారు. పాండు చెరువు కట్ట కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయం నుంచి శుక్రవారం రాత్రి సీతారాముల శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించారు. భక్తి గీతాలు ఆలపిస్తూ ప్రత్యేక కళాకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

March 28, 2026 / 08:43 AM IST

బురదగా మారిన పెదగుడబ దారి

మన్యం: పెదగుడబ ప్రధాన రహదారి ఇటీవల అకాల వర్షాల కారణంగా దారుణంగా మారింది. పార్వతీపురం గరుగుబిల్లి మార్గంలోని ఈ రోడ్డుపై గోతులు ఏర్పడి, క్వారీ లారీల రాకపోకలతో మట్టి బురదగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వెంటనే మరమత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

March 28, 2026 / 08:42 AM IST

మంత్రి చొరవతో విద్యుత్ లైన్ సమస్య పరిష్కారం

JGL: ధర్మపురి పట్టణంలో ఇళ్లపై ప్రమాదకరంగా ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ సమస్యకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో పరిష్కారం లభించింది. నూతనంగా ఏర్పాటు చేసిన లైన్‌ను ప్రారంభించిన మంత్రి, 2009 నుంచి ప్రజా సమస్యలపై అవగాహనతో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నానాని అన్నారు. రూ.4.60 కోట్లతో విద్యుత్ లైన్ షిఫ్టింగ్ పనులు కొనసాగుతున్నాయన్నారు.

March 28, 2026 / 08:41 AM IST

మొక్కజొన్న బయోపాలిమర్లతో భూమిలో కరిగే క్యారీ బ్యాగ్..!

HYD: Greeny పేరుతో ఒక స్టార్టప్, IIT HYD సహకారంతో మొక్కజొన్న బయోపాలిమర్లతో నో-ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు తయారు చేసింది. ఈ బ్యాగులు పర్యావరణహితంగా ఉండి అద్భుతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. వినియోగం తర్వాత సుమారు 180 రోజుల్లోనే పూర్తిగా మట్టిలో కలిసిపోతాయని వెల్లడించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఇవి మంచి పరిష్కారంగా భావిస్తున్నారు.

March 28, 2026 / 08:39 AM IST

14 మంది కాలిబూడిద.. తిరుపతిలో ALERT

TPT: ఇటీవల మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది కాలిబూడిదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. SP సుబ్బరాయుడు, ఆర్టీవో మురళీమోహన్ ఆదేశాలతో నిన్న రాత్రి బస్టాండ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు.

March 28, 2026 / 08:38 AM IST

ఇకపై ఇంటికే లైసెన్స్‌లు, RCలు!

TG: RC, డ్రైవింగ్ లైసెన్స్‌ల పంపిణీని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘సెంట్రలైజ్డ్ ప్రింటింగ్, డిస్పాచ్’ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఒకే కేంద్రం నుండి కార్డులు ముద్రించి నేరుగా వాహనదారుల ఇంటికే పంపిస్తారు. దీనివల్ల అవినీతికి చెక్ పడనుంది. అలాగే యూజర్ ఛార్జీల ఆదాయాన్ని రవాణా శాఖకే కేటాయించాలని CM రేవంత్ నిర్ణయించారు.

March 28, 2026 / 08:38 AM IST

వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు ముగింపు

కొంకుదురు బుడతలు మామిడి గ్రామంలో ఉగాది సందర్భంగా ప్రారంభమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వసంత నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం రాత్రి వైభవంగా ముగిశాయి. అర్చకులు బ్రహ్మశ్రీ రమణ శర్మ, శ్రీనివాస శర్మల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేయగా, మల్లిడి కోదండం బ్రదర్స్ పర్యవేక్షణలో ఏర్పాట్లు జరిగాయి.

March 28, 2026 / 08:36 AM IST

‘చెడు అలవాట్లతో జీవితం నాశనం చేసుకోవద్దు’

MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగరం గ్రామంలో శుక్రవారం స్థానిక ఎస్సై గంగారపు కరుణాకర్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ… గ్రామంలోని యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి, డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు.

March 28, 2026 / 08:36 AM IST

బ్లాక్‌మెయిల్ దందా.. రూ.50 లక్షలు డిమాండ్

CTR: జీడీ నెల్లూరు మండలానికి చెందిన తుమ్మలపల్లి వీరయ్య, మరో వ్యక్తితో కలిసి సబ్-రిజిస్టార్‌ను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్ దందాకు పాల్పడ్డాడు. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా బెదిరింపులకు దిగుతూ, రూ.50 లక్షలు, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మదనపల్లి పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.

March 28, 2026 / 08:35 AM IST

హబ్సిగూడ సర్కిల్.. కరెంట్ కంట్రోల్ నెంబర్

MDCL: హబ్సిగూడ సర్కిల్ పరిధిలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలులో ఉందని డీఈ సుబ్బారావు తెలిపారు. విద్యుత్ సరఫరా అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్త ఫీడర్లు లేదా ఇతర సమస్యలు తలెత్తిన వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం 8712471612 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.

March 28, 2026 / 08:35 AM IST

జిల్లాలో ‘కల్తీకి కళ్లెం’ వేస్తున్న అధికారులు

VKB: జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలకు, అక్రమ రవాణాకు అధికారులు కళ్లెం వేస్తున్నారు. ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు కల్తీ ఆహార పదార్థాలతో పాటుగా అక్రమ ఇసుక, కలప, మట్టి దందాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 48 కేసులు నమోదు చేసినట్లు అధికారులు చెప్తున్నారు.

March 28, 2026 / 08:34 AM IST

నంద్యాలలో ఆయిల్, గ్యాస్ సర్వేపై కలకలం

నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చిలకలూరులో ఆయిల్, గ్యాస్ సర్వే కార్యకలాపాలు రైతుల మధ్య కలకలం రేపుతున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ పొలాల్లో అధికారులు రంధ్రాలు వేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

March 28, 2026 / 08:34 AM IST