TG: RC, డ్రైవింగ్ లైసెన్స్‌ల పంపిణీని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘సెంట్రలైజ్డ్ ప్రింటింగ్, డిస్పాచ్’ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఒకే కేంద్రం నుండి కార్డులు ముద్రించి నేరుగా వాహనదారుల ఇంటికే పంపిస్తారు. దీనివల్ల అవినీతికి చెక్ పడనుంది. అలాగే యూజర్ ఛార్జీల ఆదాయాన్ని రవాణా శాఖకే కేటాయించాలని CM రేవంత్ నిర్ణయించారు.